News March 17, 2025
సిరిసిల్ల: ప్రజావాణిలో 113 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను SRCL కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో 113 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు.
Similar News
News March 18, 2025
ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.
News March 18, 2025
సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. ఇల్లంతకుంట 40.9°c, కోనరావుపేట 40.7 °c,గంభీరావుపేట 40.3°c, చందుర్తి 45.3°c, బోయిన్పల్లి 40.3°c, వీర్నపల్లి 39.9 °c,రుద్రంగి 39.5°c, తంగళ్ళపల్లి 39.4 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది.
News March 18, 2025
ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.