News February 3, 2025

సిరిసిల్ల ప్రజావాణిలో 122 దరఖాస్తులు

image

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యానాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మొత్తం 122 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

Similar News

News December 9, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc(మాస్టర్ లైబ్రరీ సైన్స్ ) 1, 2 సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం(SVU DDE) ఆధ్వర్యంలో డిగ్రీ B.A/B.Com/B.Sc చివరి సంవత్సరం పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. www.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News December 9, 2025

ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.

News December 9, 2025

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే లక్ష్యం: కామారెడ్డి SP

image

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని KMR ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురికి మించి గుమిగూడడం నిషేధమని తెలిపారు. చెక్‌పోస్టులు, FST, SST బృందాల ద్వారా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయి. 33 క్రిటికల్/సెన్సిటివ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు.