News February 3, 2025
సిరిసిల్ల ప్రజావాణిలో 122 దరఖాస్తులు

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్, అదనపు కలెక్టర్ భీమ్యానాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మొత్తం 122 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
Similar News
News February 10, 2025
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
News February 10, 2025
విశాఖ జూలో తల్లి సాంబార్ డీర్ ప్రేమకు సందర్శకుల ఫిదా..!

తల్లులు తమ పిల్లల మీద చూపించే ప్రేమకు వెలకట్టలేము. విశాఖ జూ పార్కులో ఒక తల్లి సాంబర్ డీర్ తమ పిల్లను అల్లారు ముద్దుగా సాకుతో తల్లి ప్రేమ కు అవధులు లేవని నిరూపిస్తుంది. పిల్ల ఆకలి తెలుసుకుని పాలివ్వడం కాకుండా శత్రువుల నుంచి కాపాడేందుకు దట్టమైన వృక్షాల మధ్యలో దాచిపెడుతుంది. తల్లి ప్రేమకు సాధ్యమైన ఈ దృశ్యం చూపరులను ఆలోచింపజేస్తూ అందరూ ఫిదా అయ్యేలా చేస్తుంది.
News February 10, 2025
MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.