News March 27, 2025

సిరిసిల్ల :ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

image

సెర్ఫ్ క్రింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి.దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్లజిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

image

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.

అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్

image

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.