News March 6, 2025
సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 7, 2025
MBNR: రంజాన్ మాసం.. హలీంకు సలాం.!

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNRజిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేస్తారు. మీరు తింటే ఎలాఉందో కామెంట్ పెట్టండి?
News March 7, 2025
ద్రవిడులు ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరు: స్టాలిన్

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.
News March 7, 2025
ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.