News April 7, 2025
సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

ఫుడ్ పాయిజన్తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.
Similar News
News December 5, 2025
ఉప్పును నేరుగా చేతితో తీసుకోకూడదు.. ఎందుకు?

ఉప్పును నేరుగా చేతితో తీసుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా చేయడాన్ని రహస్యాలు పంచుకోవడంలా భావిస్తారు. ఫలితంగా గొడవలు జరుగుతాయని, చేతితో ఉప్పు తీసుకున్నవారిపై శని ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యేష్టాదేవి దోషాలను తొలగించడానికి ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఇతరుల చేతి నుంచి ఉప్పు స్వీకరిస్తే, వారిలోని చెడు ప్రభావం మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తారు.
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News December 5, 2025
అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.


