News February 24, 2025
సిరిసిల్ల: బాత్ రూంలో జారిపడి కానిస్టేబుల్ మృతి

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఆగ్రారం విష్ణు(30) అనే కానిస్టేబుల్ ఆదివారం బాత్ రూంలో జారిపడి మృతిచెందారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. సర్దపూర్ 17వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విష్ణు ఆదివారం ఉదయం బాత్రూం వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. విష్ణుకు భార్య, కుమారుడు ఉన్నారు.
Similar News
News November 2, 2025
తొలి ‘గే’ ప్రధానిగా రాబ్ జెట్టెన్!

నెదర్లాండ్స్ ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఇటీవల ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38ఏళ్ల రాబ్ జెట్టెన్ ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆ దేశ పిన్న వయస్కుడు, తాను ‘గే’ అని బహిరంగంగా చెప్పుకున్న రాబ్ PMగా నిలిచి రికార్డులకెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని, గొప్ప బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. కాగా అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్తో జెట్టెన్ ఎంగేజ్మెంట్ 3ఏళ్ల కిందటే జరిగింది.
News November 2, 2025
VJA: మరి కాసేపట్లో జడ్జి ముందు జోగి రమేశ్ హాజరు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇవాళ సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరికాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి కష్టడి కోరే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముంది విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు.
News November 2, 2025
అనంతపురం: డివైడర్ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్పై అనంతపురం నుంచి హిందూపూర్కి వెళుతుండగా డివైడర్ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


