News February 28, 2025
సిరిసిల్ల: బావిలో పూడిక తీస్తున్న వ్యక్తి మృతి

ఓ బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ముస్తాబాద్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓల్లపు దేవరాజ్ (37) మండల కేంద్రానికి చెందిన నరసయ్య అనే రైతు వ్యవసాయ భూమిలో పూడికతీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో ఉన్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
వరంగల్: చిన్నారుల్లో పెరుగుతున్న న్యూమోనియా కేసులు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో న్యూమోనియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి 30 మధ్య 239 మంది చిన్నారులు న్యూమోనియాతో వార్డులో చేరారు. గత నెలలో 780 మంది పిల్లలు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో ఓపీ సేవలు పొందారు. రోజుకు 7 నుంచి 8 మంది చిన్నారులు న్యూమోనియాతో చేరుతున్నారు. జ్వరం, దగ్గు, అలసట, శ్వాసలో ఇబ్బంది, గురక వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 5, 2025
చలి ఉత్సవాలు జనవరికి వాయిదా: కలెక్టర్

డిసెంబర్‌లో జరగాల్సిన చలి ఉత్సవాలను జనవరి నెలాఖరుకు వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. డిసెంబర్‌లో CM చంద్రబాబునాయుడు అందుబాటులో ఉండరని, ఈ కారణంగా చలి ఉత్సవాలు వాయిదా పడ్డాయన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ కోరారు. ఏటా విశాఖలో జరిగే విశాఖ ఉత్సవాలు కూడా జనవరి నెలాఖరుకు వాయిదా పడ్డాయన్నారు.
News December 5, 2025
ప.గో: ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం జంగారెడ్డిగూడెం డిపోను సందర్శించిన ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో సొంత, అద్దె బస్సులను ప్రవేశపెడతామన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల ఆక్యుపెన్సీ పెరిగిందని ఎండీ తెలిపారు.


