News February 28, 2025

సిరిసిల్ల: బావిలో పూడిక తీస్తున్న వ్యక్తి మృతి

image

ఓ బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ముస్తాబాద్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓల్లపు దేవరాజ్ (37) మండల కేంద్రానికి చెందిన నరసయ్య అనే రైతు వ్యవసాయ భూమిలో పూడికతీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో ఉన్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 27, 2025

భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్

image

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్‌బాగ్‌ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.

News March 27, 2025

WGL: ఈ వారంలో అధిక ధర పలికిన పత్తి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 27, 2025

భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

image

కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్‌గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

error: Content is protected !!