News February 17, 2025
సిరిసిల్ల: ‘బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’

బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు బీసీ సాధికారిత సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. బీసీలకు 42 శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు విద్యలో, ఉపాధిలో 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత రాష్ట్ర, జిల్లా నాయకులు కొండ దేవయ్య, పొలాస నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 29, 2025
MBNR: ఆపరేషన్ స్మైల్-XII.. సమన్వయ సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు సోమవారం అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం అధ్యక్షతన ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహణకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం మాట్లాడుతూ.. 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 29, 2025
చిత్తూరు SPని కలిసిన ట్రైనీ SP

చిత్తూరు SP తుషార్ డూడీని సోమవారం ట్రైనీ ఎస్పీ డా.తరుణ్ పహ్వ మర్యాదపూర్వకంగా కలిశారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన AP క్యాడర్‌కు ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల ప్రొబేషనరీ ట్రైనింగ్ నిమిత్తం చిత్తూరుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమస్యలను శ్రద్ధగా వినడం, వేగంగా పరిష్కరించడం ముఖ్యమని SP ఆయనకు సూచించారు.
News December 29, 2025
కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో యాసంగి పంటలకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలో అన్ని కౌంటర్లలో యూరియా విక్రయం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. యూరియా కొనుగోలు చేసే రైతు ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకుని సెంటర్‌కు వెళ్లాలన్నారు. అవసరమైన కౌంటర్ల వద్ద శామియానాలు, తాగు నీటి వసతి కల్పించాలని సూచించారు.


