News January 31, 2025
సిరిసిల్ల: బెటాలియన్ కానిస్టేబుల్ మృతి

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News October 21, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి అందజేశారు.
News October 21, 2025
133M మంది బాలికలు బడికి దూరం!

లింగ సమానత్వంపై ఎన్ని చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్ల బాలికలు చదువుకు దూరంగా ఉన్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (UNSCO) పేర్కొంది. ప్రస్తుతం ప్రైమరీలో 91M, సెకండరీలో 136M మంది బాలికలు నమోదయ్యారు. ఉన్నతవిద్యలో వారి చేరిక 3రెట్లు పెరిగింది. అయితే బీజింగ్ డిక్లరేషన్(1995) మహిళలకు సమానావకాశాలపై తీర్మానించి 3 దశాబ్దాలు దాటుతున్నా అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అధికంగానే ఉన్నారని GEM తెలిపింది.
News October 21, 2025
జనగామ: కార్యాలయం ఉన్నా.. చేయూత సున్నా!

యువతలోని నైపుణ్యాలను పెంపొందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన యువజన కార్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో యువజన కార్యక్రమాల నిర్వహణ కరవైంది. జనగామ జిల్లాలో 1,89,000 మంది యువత ఉన్నప్పటికీ స్థానిక యువతకు మాత్రం సంబంధిత శాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం.