News January 31, 2025

సిరిసిల్ల: బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మృతి

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్‌నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News February 19, 2025

నేటి జగిత్యాల మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ పంటల ధరలు ఇలా ఉన్నాయి.. కందులు క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 7,096, కనిష్ఠ ధర రూ. 4,559 లుగా పలికాయి. అనుముల ధరలు రూ. 4,559 నుండి రూ. 6,900 మధ్య ఉన్నాయి. పల్లికాయ రూ. 2,851లుగా పలికాయి. మక్కలు రూ. 1,955 నుండి రూ. 2,222 మధ్య పలికాయి. వరి ధాన్యం (JSR) రూ. 2,621లుగా పలికాయి. కాగా ఈరోజు మొత్తం 97 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.

News February 19, 2025

అనకాపల్లి: మెడికల్ కాలేజీ స్థలంలో ఆక్రమణలు తొలగింపు

image

మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం రెవెన్యూ పరిధిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సేకరించిన భూముల్లో కొంతమంది సరుగుడు మొక్కలు నాటారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ తహశీ‌ల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్ లోకవరపు రామారావు సరుగుడు మొక్కలు నాటిన ప్రాంతాన్ని చదును చేయించి ఆక్రమణలు తొలగించారు. 

News February 19, 2025

ధైర్యశాలి శివాజీ మహారాజ్: హరీష్ రావు

image

ధైర్యశాలి చత్రపతి శివాజీ మహారాజ్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్‌కు నివాళులు అర్పించిన ఫోటోను పోస్ట్ చేశారు. చత్రపతి శివాజీ మహారాజ్ విజయనరీ కల లీడర్ అని, ఆయన అడుగుజాడలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారతజాతి వీరత్వానికి ప్రతీక, జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని కీర్తించారు.

error: Content is protected !!