News January 31, 2025

సిరిసిల్ల: బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మృతి

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్‌నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News February 16, 2025

ఖమ్మం: మృతదేహం లభ్యం.. హత్య? ఆత్మహత్య?

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం- మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కాల్వకట్ట పక్కన గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య?.. లేదా హత్య?.. అనే కోణంలో విచారిస్తున్నారు. మృతుడు పాతర్లపాడుకు చెందిన కొల్ల సైదులుగా గుర్తించారు.

మెదక్: భార్య మృతిని తట్టుకోలేక భర్త సూసైడ్

image

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలిపిచేడ్‌లో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాలు.. HYDకి చెందిన జగన్ రావు(60) భార్య మూడు నెలల కింద మృతి చెందడంతో మనస్థాపం చెంది మండలంలోని చిట్కుల్ శివారులో చాముండేశ్వరీ ఆలయ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

error: Content is protected !!