News March 7, 2025
సిరిసిల్ల: బ్యాంకర్ల తోడ్పాటు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లను వివిధ రుణాలకు జమ చేయకూడదన్నారు.
Similar News
News December 28, 2025
రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
HYD: ఐటీ హబ్లో Monday Blues!

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?
News December 28, 2025
రేపు కలెక్టరేట్లో ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం: కలెక్టర్

ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా భూసంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్లో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలతో ఇబ్బంది పడే అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


