News July 12, 2024
సిరిసిల్ల: భయపెడుతున్న డెంగ్యూ!

ఉమ్మడి KNR వ్యప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి(M)లో డెంగ్యూ కేసు నమోదైంది. ఈ ఏడాది మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్నవారి సంఖ్య లెక్కలోకి రావట్లేదు. జిల్లాలో 17 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 6 ప్రాంతాలను డెంగ్యూ హైరిస్క్ ప్రాంతాలుగా వైద్యాధికారులు గుర్తించారు.
Similar News
News February 13, 2025
KNR: ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలన్నారు.
News February 12, 2025
KNR: విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు.
News February 12, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.