News April 10, 2025
సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.
Similar News
News December 27, 2025
ప.గో: ‘పందెం కోడిలా జగన్పై పోరాడతా’

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే తన ఏకైక లక్ష్యమని, ఎవరి మద్దతు లేకుండా ఒంటరిగానే పందెం కోడిలా పోరాడతానని డిప్యూటీ స్పీకర్ RRR స్పష్టం చేశారు. ఉండిలో అభివృద్ధి పనుల కోసం కాలువ గట్లపై ఉన్న కట్టడాలను తొలగిస్తుంటే కేవలం చర్చిలను మాత్రమే తొలగిస్తున్నట్లు జగన్ అనుకూల వెబ్ జర్నలిస్టులు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఉన్నా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు
News December 27, 2025
రేపు పాక హనుమంతు అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు చండూరు మండలం పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు.
News December 27, 2025
జగిత్యాల: మొన్నే పోస్టింగ్.. ఇంతలోనే గుండెపోటుతో మృతి

జగిత్యాల జిల్లా వైద్యాధికారి(DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 4:30 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా నియమితులైన శ్రీనివాస్ మృతి చెందడంతో వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.


