News February 24, 2025

సిరిసిల్ల: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News December 4, 2025

వర్ధన్నపేట ఇన్‌ఛార్జి.. ఎర్రబెల్లి VS దాస్యం

image

బీఆర్‌ఎస్‌ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు – దాస్యం వినయభాస్కర్‌ వర్గాల మధ్య విభేదాలు కలకలం రేపుతున్నాయి. ఇన్‌ఛార్జి బాధ్యతలపై ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బహిరంగమైంది. హసన్‌పర్తి, ఐనవోలు మండలాలపై హస్తక్షేపం విషయంలో నెలకొన్న అసంతృప్తి కారణంగా, జీపీ ఎన్నికల్లో పార్టీ సమన్వయంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది.

News December 4, 2025

‘మీ మొబైల్ – మీ ఇంటికి’

image

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం మొదలవుతోంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, నేరుగా యజమానుల ఇంటి వద్దకే వెళ్లి అందించేందుకు ‘మీ మొబైల్ – మీ ఇంటికి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సేవలతో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు పదేపదే రావాల్సిన అవసరం తప్పుతుంది. నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా వ్యాప్తంగా మొబైల్‌లను ఎస్పీ అధికారులు తెలిపారు.

News December 4, 2025

ఇండియాలో పుతిన్‌ను అరెస్టు చేస్తారా?

image

ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్‌ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్‌స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్‌ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.