News July 2, 2024
సిరిసిల్ల: మద్యానికి బానిసై యువకుడి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐతం అజయ్(25) అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ ఇరుగుపొరుగు వారితో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.
News October 22, 2025
కరీంనగర్: రేపే లాస్ట్ డేట్.. 27న డ్రా

కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అని, రూ.3 లక్షల రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస రావు తెలిపారు. నిన్నటి వరకు 2,639 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు అప్లికేషన్స్ సమర్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను ఈనెల 27న నిర్వహించే లాటరీ ద్వారా దక్కించుకోవాలని సూచించారు.
News October 22, 2025
APK ఫైల్స్ ఓపెన్ చేసి ఇన్ స్టాల్ చేస్తే ఇలా చేయండి: సీపీ

ఎవరైనా అనుకోకుండా అనుమానాస్పద, మోసపూరిత APK ఫైల్‌ను క్లిక్ చేసి లేదా ఇన్స్టాల్ చేసి ఉంటే ఇలా చేయాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.
1. వెంటనే మీ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌కు మార్చండి.
2. అనుమానాస్పద APK ఫైల్‌ను అన్ఇన్స్టాల్ చేయండి/తొలగించండి.
3. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి మీ ఫోన్ నుండి ##002# డయల్ చేయండి.
4. 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయండి.