News April 10, 2025
సిరిసిల్ల: మద్య మానేరులో కేజీ కల్చర్ యూనిట్లను తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేర్ రిజర్వాయర్ జలాశయ పరిధిలో గల చీరవంచలో ఫిషిన్ ఫార్మ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. రిజర్వాయర్లో వృత్తాకార, పది 10 మీటర్ల డయా సర్క్యులర్ బోనులు, ఎనిమిది 5×5 మీటర్ల సైజు గల కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేసి, దానిలో దాదాపు 4.2 లక్షల విత్తనాలను నిల్వ చేశారు.
Similar News
News November 25, 2025
అన్నమయ్య: నెరవేరిన సీఎం హామీలు

అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం(M) దేవగుడిలో ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటించారు. కొందరి బంగారు రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆదేశాలతో కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించారు. DMF–CSR నిధుల నుంచి రూ.6.70 లక్షలు విడుదల చేశారు. మాలేపాటి హేమలత రూ.75వేలు, మాలేపాటి ఈశ్వర రూ.1.26లక్షలు, ముంతాజ్ బేగానికి రూ.4.69లక్షల చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు.
News November 25, 2025
ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం
News November 25, 2025
NIT రాయ్పుర్లో ఉద్యోగాలు

NIT రాయ్పుర్ 7పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ మెయిల్ ద్వారా దరఖాస్తును
pavanmishra.it@nitrr.ac.inకు పంపాలి.


