News December 21, 2024

సిరిసిల్ల: మరో నేత కార్మికుడి ఆత్మహత్య

image

నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్లలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం BY నగర్‌కు చెందిన నక్క శ్రీనివాస్(41) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా నిన్న మరో నేత కార్మికుడు<<14931601>> దూస గణేశ్ సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News December 22, 2024

భరోసాతో మహిళలకు మరింత భద్రత: డీజీపీ జితేందర్

image

కరీంనగర్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంతో మహిళలకు, బాలికలకు మరింత భద్రత కలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా పోలీసు, న్యాయ, వైద్య సేవలు ఒకే గూటి కింద ఉంటాయని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు.

News December 22, 2024

కరీంనగర్: రేపు డయల్ యువర్ డీఎం

image

డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిపో -2 మేనేజర్ వి.మల్లయ్య తెలిపారు. కావున కరీంనగర్-2 డిపో పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, గంగాధర తదితర మండలాల ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు సెల్ నంబర్ 9959225921 కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.

News December 22, 2024

వీణవంక: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బండారి చేరాలు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టంది. ఈ ప్రమాదం బేతిగల్ శివారులో జరిగింది. తీవ్ర గాయాలైన చేరాలుని చికిత్స నిమిత్తం హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.