News March 31, 2025
సిరిసిల్ల: మసీదులు, ఈద్గాల వద్ద భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయగా.. వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 9, 2025
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News November 9, 2025
తంబళ్లపల్లి: ‘టమాటా రైతులను ఆదుకోండి’

టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తంబళ్లపల్లి (M)లో టమాటాను పండించిన రైతులు తుఫాన్ ప్రభావంతో గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేస్తున్నామంటున్నారు. గుండ్లపల్లి, గోపిదిన్నె, కన్నెమడుగు, కొటాల తదితర పంచాయతీల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటలు వేశామన్నారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు ఖర్చును ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
News November 9, 2025
సిద్దిపేట: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చని, ఈనెల 15 వరకు ప్రతి రోజు లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. చిన్న చిన్న కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని, రాజీ పడదగిన కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
– SHARE IT


