News March 31, 2025

సిరిసిల్ల: మసీదులు, ఈద్గాల వద్ద భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయగా.. వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News April 25, 2025

WGL: బైకుపై వెళ్తుండగానే గుండెపోటు.. వ్యక్తి మృతి

image

గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.

News April 25, 2025

అనకాపల్లిలో మృతి చెందిన నక్కపల్లి వ్యక్తి

image

అనకాపల్లి పట్టణం రైల్వే స్టేషన్ గూడ్స్ జంక్షన్ వద్ద ఈనెల 24 జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నక్కపల్లి మండలం ముకుందరాజుపేటకు చెందిన వి.నాగేశ్వరరావు(40)గా గుర్తించినట్లు ఎస్ఐ శేఖరం తెలిపారు. మృతుడు భవన నిర్మాణ కార్మికుడని రోజు రైలులో వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్తుంటాడని తెలిపారు. కుటుంబ సభ్యులు గురువారం వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 25, 2025

పోప్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి

image

ఈనెల 21న కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఇవాళ వాటికన్ సిటీ వెళ్లనున్న ఆమె రేపు అంత్యక్రియల్లో పాల్గొంటారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలుపుతారని వెల్లడించింది.

error: Content is protected !!