News February 23, 2025
సిరిసిల్ల: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెట్టింది పేరు. వేములవాడ రాజన్న దేవాలయంతో సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగ రోజు నిండిపోతాయి. నగునూరు, గుజ్జులపల్లి, జమ్మికుంటలో బొమ్మలగుడి(KNR), JGTLలో దుబ్బరాజన్న, కోటిలింగాల, పెద్దపల్లిలో ఓదెల మల్లికార్జునస్వామి, వేలాల, భూపాలపల్లిలో కాళేశ్వరం దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడుతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి.
Similar News
News September 16, 2025
GWL: స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలి- కలెక్టర్

ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. అక్కడ ఈవీఎంలకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షణ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక తహశీల్దార్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.