News February 3, 2025
సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ

జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News November 13, 2025
VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 13, 2025
హనుమకొండ: స్కాలర్ షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి తెలిపారు. అర్హులైన ఈబీసీ, బీసీ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో డిసెంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


