News February 3, 2025

సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ

image

జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

భూపాలపల్లి: 19 క్రిటికల్, 23 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు

image

మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ముగుసింది. ఇక పోలింగ్‌కు ఒక రోజు ఉండడంతో 52,726 మంది ఓటర్లు తమ ఓట హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాల్లో 10మంది ఆర్వోలు, 104మంది పీవోలు, ఎపివొలు104 మంది ఏపీవోలు, 312 మంది ఓపీవోలను నియమించారు. 19 క్రిటికల్, 23సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు.

News February 9, 2026

పోలింగ్, కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ ఎస్పీ

image

ఎన్నికల పోలింగ్ మొదలుకొని కౌంటింగ్ వరకు పోలీసు శాఖ తరపున పూర్తి ఏర్పాట్లు చేశామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత తదితర అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదినికి కూలంకుషంగా వివరించారు. మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

News February 9, 2026

శాంతియుత ఎన్నికల కోసం సెక్షన్ 163 అమలు: CP

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు, అలాగే కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. నలుగురికి మించి గుంపులు, ఊరేగింపులు, ఆయుధాలతో సంచారం నిషేధమని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.