News February 5, 2025
సిరిసిల్ల: మాతా శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్

మాతా శిశు మరణాలను అరికట్టాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాత శిశు మరణాలు జరగకుండా మొదటిసారి గర్భం ధరించిన తర్వాత రిజిస్ట్రేషన్ నుంచి గర్భధారణ చెకప్ లు ఆశా కార్యకర్తల ద్వారా ఏఎన్ఎం ద్వారా చెకప్ లు సకాలంలో చేయించాలన్నారు.
Similar News
News November 22, 2025
వారం రోజులు కన్నాల రైల్వే గేటు మూసివేత

పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును వారం రోజులు మూసివేస్తున్నట్టు శనివారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచి 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.
News November 22, 2025
రేపు రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.
News November 22, 2025
‘స్వయం సహాయక గ్రూపుల్లో కిశోర బాలికలకు అవకాశం’

స్వయం సహాయక గ్రూపుల్లో 15- 18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలకు అవకాశం కల్పిస్తామని, 60 ఏళ్లు దాటిన మహిళలకూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో చేరారని వివరించారు.


