News March 27, 2025
సిరిసిల్ల: మాదకద్రవ్యాలను నిర్మూలించాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని గురువారం కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే సమక్షంలో అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలన్నారు.
Similar News
News November 21, 2025
MNCL:ఈనెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల23న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదిలాబాద్లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈపోటీల్లో ఎంపికైనవారు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News November 21, 2025
దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్కు బదిలీ

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
News November 21, 2025
బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలి: దేవినేని ఉమా

ప్రజాస్వామ్యంలో పేదవాడైనా, సంపన్నుడైనా చట్టం ముందు అందరం సమానమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరవు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యాడని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నావని అభిమానం ఉప్పొంగిందా అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీపై విషం చిమ్ముతున్న బ్లూ మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాలని దుయ్యబట్టారు.


