News March 19, 2025
సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.
Similar News
News March 21, 2025
దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News March 21, 2025
అనంతపురం అభివృద్ధిపై సీఎంతో చర్చ

విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును గురువారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ తరలింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరువ వంక ప్రొటెక్షన్ వాల్ గురించి సీఎంకు వివరించినట్లు ఎమ్యెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
News March 21, 2025
శుభ ముహూర్తం (21-03-2025)

☛ తిథి: బహుళ సప్తమి రా.11.50 వరకు తదుపరి అష్టమి ☛ నక్షత్రం: జ్యేష్ట రా.9.49 వరకు తదుపరి మూల☛ శుభ సమయం: ఉ.9.48 నుంచి 10.18 వరకు, తిరిగి సా.4.48నుంచి 5.00వరకు ☛ రాహుకాలం: ఉ.10.30నుంచి 12.00 వరకు ☛ యమగండం: మ.3.00 నుంచి 4.30 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు తిరిగి మ.12.24నుంచి 1.12వరకు ☛ వర్జ్యం: లేదు ☛ అమృత ఘడియలు: మ.12.20 నుంచి 2.02వరకు