News March 19, 2025
సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్‌కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.
Similar News
News April 20, 2025
రేపటి నుంచి వైన్స్ బంద్

TG: ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి వైన్స్ మూతపడనున్నాయి. HYD, సికింద్రాబాద్‌లోని మద్యం దుకాణాలను ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ జరిగే ఈ నెల 25న వైన్స్ మూసివేయాలన్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, MIM తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు.
News April 20, 2025
ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి

TG: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న దొంగలంతా నిన్న హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీ నేతలు విష సర్పాల కంటే ప్రమాదమని మండిపడ్డారు. ఒవైసీ మీటింగ్‌కు స్పాన్సర్ రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News April 20, 2025
సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.