News February 13, 2026
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 39 వార్డులకు గాను 27 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, ఆరుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు బీజేపీ అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మున్సిపల్ పీఠాన్ని ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్, బీజేపీలు సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితమయ్యాయి.
Similar News
News March 6, 2026
పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 6, 2026
శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
News March 6, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.


