News February 26, 2025
సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.
Similar News
News November 13, 2025
రామగిరి: సింగరేణి భూసేకరణ, పరిహారంపై కలెక్టర్ సమీక్ష

సింగరేణి భూసేకరణ పనులను సజావుగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న జాతీయ రహదారి పరిహారాలను త్వరగా చెల్లించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం రామగిరి తహశీల్దార్ కార్యాలయంలో భూసేకరణ అంశాలపై ఆయన సమీక్షించారు. సింగరేణి సంస్థ అవసరమైన వివరాలు అందించినందున, ఎస్.డీ.సీ., తహశీల్దార్, ఎంపీడీఓ, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
News November 13, 2025
కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.
News November 13, 2025
విశాఖలో ఒకేరోజు 5 ఐటీ కంపెనీలకు భూమిపూజ

భాగస్వామ్య సదస్సు ముందు మంత్రి నారా లోకేశ్ మధురవాడ ఐటీ హిల్, యండాడ ప్రాంతాల్లో 5సంస్థలకు భూమిపూజ చేశారు. రూ.3,800 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థలు 30వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. సైల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్, ఫినోమ్ పీపుల్స్, రహేజా, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టులకు లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


