News February 26, 2025

సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.

Similar News

News October 24, 2025

సిద్దిపేట: గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ

image

సిద్దిపేటకు వచ్చిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ విజయకుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్, సీపీ గవర్నర్‌కు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీస్ అధికారులు గవర్నర్‌కు వందన స్వీకారాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.

News October 24, 2025

జటప్రోల్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 26.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 14.5, తిమ్మజిపేట 6.5, కిష్టంపల్లి 5.3, అమ్రాబాద్ 4.0, ఊర్కొండ 2.3, తోటపల్లి 2.0, పెద్దకొత్తపల్లి 1.8, అచ్చంపేట 1.0, కల్వకుర్తి 0.8, అత్యల్పంగా తెలకపల్లి, వెల్టూర్ లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 24, 2025

బాధిత కుటుంబాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

కర్నూల్ జిల్లా కల్లూరులో బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. బాధిత కుటుంబాలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చాన్నారు. GDL కలెక్టరేట్‌ 9502271122, హెల్ప్ డెస్క్ 9100901599, 9100901598, కర్నూల్ GGH 9100901604, GDL పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ 8712661828.