News February 26, 2025
సిరిసిల్ల: ‘యముడు పిలుస్తున్నాడు.. నేను చనిపోతున్నా’

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మంజుల, బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్(19) HYDలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి ఫోన్ చేసి తనకు చదువు ఇష్టం లేదని చెప్పాడు. మంగళవారం ‘అమ్మానాన్న సారీ.. నన్ను యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా బై..బై..’అంటూ సూసైడ్ నోట్ రాసి HYD కాచిగూడలో ట్రైన్ కిందపడి చనిపోయాడు.
Similar News
News March 16, 2025
కరీంనగర్: రైలు పట్టాల పక్కన యువజంట మృతదేహాలు (UPDATE)

జమ్మికుంట(M) పాపయ్యపల్లి-బిజిగిరి షరిఫ్ గ్రామాల రైల్వే ట్రాక్ మధ్య శనివారం రాత్రి ఓ <<15773958>>యువజంట<<>> మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతిచెందిన యువకుడు ఇల్లందకుంట(M) రాచపల్లికి చెందిన మెనగు రాహుల్(18)గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దిరి తలలకు మాత్రమే గాయాలున్నాయి. ఒంటిపై ఎక్కడా గాయాలులేవు. దీంతో ఇది ఆత్మహత్య? లేక హత్య అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News March 16, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.
News March 15, 2025
జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.