News February 4, 2025
సిరిసిల్ల: రీల్స్ కోసం ఈతకు వెళ్లిన బాలుడి మృతి

ముస్తాబాద్(M)లో ఓ బాలుడు రీల్స్ కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో రీల్స్ కోసం ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 13, 2026
జనవరి 13: చరిత్రలో ఈరోజు

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం
News January 13, 2026
ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్‌లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.
News January 13, 2026
నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్

చిన్నమండెం మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో ఆరుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టయ్యారు. రూ.3 లక్షల నగదు, ఒక కారు, 2 కేజీల నకిలీ బంగారం, 170 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో వీరబల్లి, తమిళనాడుకు చెందిన నిందితులు ఉన్నారు. నకిలీ బంగారం విక్రయం, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


