News April 15, 2025
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కా కార్యచరణ అమలు చేయాలి: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు రబ్బర్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 25, 2025
నిర్మల్: కలెక్టర్‌కు ఎస్పీ అభినందన

జలసంచాయ్–జనభాగీదారీ అవార్డును కలెక్టర్ అభిలాష అభినవ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేక్ కట్ చేయించారు.
News November 25, 2025
ఖమ్మం బీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <


