News April 28, 2024
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన మట్ట సురేశ్ రెడ్డి- దీప్తి దంపతులు నిర్మల్ జిల్లాలోని బంధువుల ఇంటికి ‘ఆడెల్లి పోచమ్మ’ బొనాల పండగకు వెళ్లారు. అది ముగించుకుని తిరుగు పయనమయ్యారు. డిచ్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో దీప్తి మృతిచెందగా.. సురేశ్ గాయాలతో బయటపడ్డారు.
Similar News
News November 13, 2024
పెద్దపల్లి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం
పెద్దపల్లి జిల్లా రాఘవపూర్- కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
News November 13, 2024
ఇది ట్రైలర్ మాత్రమే.. 70mm సినిమా ముందుంది: హరీశ్ రావు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని, 70mm సినిమా ముందుంది.. రేవంత్ రెడ్డి జాగ్రత్త అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగిత్యాల అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, జగిత్యాల జైత్రయాత్ర అందరికీ తెలిసిందేనని, జగిత్యాలలో సంజయ్ సమర శంఖం పూరించాడన్నారు. రేవంత్ గాలి మోటార్‌లో కాదు.. కల్లాలలో తిరుగు అని మండిపడ్డారు.
News November 13, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోరుట్ల నుంచి జగిత్యాలకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ @ ఎమ్మెల్యే పాదయాత్రలో దొంగల చేతివాటం @ ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష @ రామగుండంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు @ మానకొండూరులో పురుగుల మందు డబ్బాతో రైతు హల్చల్ @ తిమ్మాపూర్‌లో కారు, బస్సు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన