News February 28, 2025
సిరిసిల్ల: లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలి: శైలజా రామయ్యార్

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ సూచించారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్టైల్ పార్క్ పరిశ్రమల యజమానులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నేడు సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Similar News
News March 19, 2025
NLG: లక్ష ఎకరాలకు సాగునీరు.. 107 గ్రామాలకు తాగునీరు

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామన్నారు.
News March 19, 2025
రూ.3,04,965 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన Dy.CM

తెలంగాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లబడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12571 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేలకోట్లు, విద్యాశాఖ రూ.23108 కోట్లు కళ్యాణ లక్ష్మీ రూ.3683, వైద్యారోగ్యశాఖకు రూ.23108 కోట్లు, గృహజ్యోతి రూ.2080 కోట్లు, రైతు బీమా రూ.1539 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.
News March 19, 2025
పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంది?

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏడాదంతా కాలేజీలకు వెళ్లిన వేలాది స్టూడెంట్స్ పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. తొలి పరీక్షను ఏకంగా 17వేల మంది రాయలేదు. నిన్న ఫిజిక్స్ & ఎకనామిక్స్ పరీక్షలు జరగ్గా 13,403 మంది డుమ్మా కొట్టారు. పరీక్షలకంటే అంత ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాను రాను విద్యార్థులు చదువును మరింత నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.