News April 16, 2025

సిరిసిల్ల: లారీ ఢీకొని యువకుడి మృతి

image

కామారెడ్డి మండలం దేవునిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట్ మండలం నాగంపేటకు చెందిన వినోద్ కుమార్(30), అతని స్నేహితుడు దేవేందర్ కామారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఉగ్రవాయి మైసమ్మ వద్ద లారీ ఢీకొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించగా వినోద్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News December 24, 2025

VHT: భారీ విజయం.. 397 పరుగుల తేడాతో

image

VHTలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో బిహార్ 397 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ వైభవ్, ఆయుశ్, గనిల శతకాల విధ్వంసంతో 50 ఓవర్లలో <<18657571>>574<<>> రన్స్ చేసింది. ఛేదనలో అరుణాచల్ 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో VHT చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదైంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌పైనే తమిళనాడు 435 రన్స్ తేడాతో గెలిచింది.

News December 24, 2025

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు: రేవంత్

image

TG: నీటి ప్రాజెక్టుల అంశంలో KCRకు CM రేవంత్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం. కానీ KCR పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా, తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు నీళ్లు రాలేదు. పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని కొడంగల్ సభలో ఆరోపించారు.

News December 24, 2025

హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>విశాఖపట్నంలోని<<>> హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ , డిగ్రీ/పీజీ , LLB/LLM, ICAI/ICWAI, MBA, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు ఫీజు లేదు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hslvizag.in