News March 11, 2025
సిరిసిల్ల: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: రజిత

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఆశానోడల్ పర్సన్స్కు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లలకు వారి యొక్క ఆరోగ్యం, శారీరక ఎరుగుదల, మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్టు ఆమె స్పష్టం చేశారు.
Similar News
News October 14, 2025
IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
News October 14, 2025
KNR: బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం..!

KNR(D) కొత్తపల్లి PS పరిధిలో ఘోరం జరిగింది. ఓ బాలికకు ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాని(గ్రానైట్ క్వారీ)కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కాగా, వీరందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. బాలిక, యువకులు చిన్నపటి నుంచి కలిసి తిరిగేవారు. ఈ క్రమంలోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేశారు. వీడియో వైరలై బాలిక కుటంబీకుల కంటపడింది.
News October 14, 2025
రేపటి నుంచి నో ఫ్లై జోన్ : కర్నూలు ఎస్పీ

రేపటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ‘No Fly Zone for Drones’గా ప్రకటించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రధాని <<18001616>>మోదీ<<>> పర్యటన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా, 7500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పసుపుల రోడ్డులోని కన్వెకేషన్ హాల్లో బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.