News April 3, 2025
సిరిసిల్ల: వరుస దొంగతనాలు.. జాగ్రత్త..!

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 15 శనివారం ఇల్లంతకుంట మండలం రేపాకలోని ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుడి తలుపులు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. మార్చి 28 శుక్రవారం బోయినపల్లి మండలం కొదురుపాకలో సట్టా జలజ ఇంట్లో దొంగతనం జరిగింది. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరించారు.
Similar News
News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.
News April 11, 2025
రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
రుషికొండ: రేపటి నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిలిపివేత

విశాఖ రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారి లడ్డూల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్య శుక్రవారం తెలిపారు. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు శ్రీవారి లడ్డూల పంపిన నేపథ్యంలో ఇక్కడి విక్రయాలు నిలిపివేశామన్నారు. కావున భక్తులు గమనించాలని కోరారు.