News October 25, 2024
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలి: ఎమ్మెల్యే కేటీఆర్
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ భారం ఎన్నడూ ప్రజలపై మోపలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పవర్లుమ్ రంగానికి 50% సబ్సిడీ ఇవ్వాలని కోరారు. పేద మధ్య తరగతి కుటుంబాలే కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో నివసిస్తున్నారని విద్యుత్ భారాన్ని వారిపై మోపవద్దని సూచించారు.
Similar News
News November 8, 2024
సింగరేణి: ‘రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి’
సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్ణయించింది. ఇంకా 5 మాసాలు ఉన్నప్పటికీ నెలకు 7.63 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయి. సమిష్టిగా ఉద్యోగులు కృషి చేయాలని కోరుతున్నారు.
News November 8, 2024
ఈనెల 10న పెద్దపల్లిలో సదర్ ఉత్సవాలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఈనెల 10న సా.4 గంటలకు ఘనంగా సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా యాదవ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. యాదవుల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యాదవ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి తరలి రావాలని కోరారు. మరి ఈ వేడుకలకు మీరు వెళ్తున్నారా? కామెంట్ చేయండి.
News November 7, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వెల్గటూర్ మండలంలో వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి.
@ ముత్తారం మండలంలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత.
@ కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ట్రాక్టర్, బస్సు ఢీ.. కార్మికులకు గాయాలు.
@ మెట్పల్లి మండలంలో వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ సమగ్ర కుటుంబ సర్వేను పక్కడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్.
@ ఇబ్రహీంపట్నం మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్.