News March 14, 2025
సిరిసిల్ల: వాహనం, డ్రైవర్ కు దరఖాస్తులు ఆహ్వానం

24/7 అందుబాటులో ఉండేలా వాహనం, డ్రైవర్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సొంత ఏసి వాహనం, వాహనానికి డ్రైవర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసక్తి గలవారు ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు కలెక్టరేట్లోని 33 వ నంబర్ రూమ్ లో సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News December 7, 2025
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ సేవలన్నింటిని ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తీసుకురావాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై ఎంపీడీఓలతో కలెక్టర్ శనివారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. కౌశలంలో పంచాయతీ కార్యదర్శుల సేవలను ప్రశంసించారు.
News December 7, 2025
వెంకటాపురం భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.


