News March 9, 2025

సిరిసిల్ల: విఘాతం కలిగిస్తే కఠినచర్యలు: ఎస్పీ

image

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. సామాన్యుడి దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.

Similar News

News December 8, 2025

తిరుమల: ఇద్దరు నిందితులకు 4 రోజుల కస్టడీ

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు నెల్లూరు ఏసీబీ కోర్టు 4 రోజులు కస్టడీకి అనుమతించారు. ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యంను ఈనెల 9 నుంచి 12 వ తేదీ వరకు సీబీఐ సిట్ కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కాగా ఏ16 బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News December 8, 2025

బాపట్ల జిల్లాలో దోపిడీ.. అరికట్టేదెవరు..?

image

‘రక్తమోడ్చి పండించిన పంట రాబంధులకే’ అన్న చందంగా ఉందని రైతులు వాపోతున్నారు. తాము కష్టపడి పండించిన పంటను అమ్ముకోడానికీ స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. RSKలకు ధాన్యాన్ని అమ్మడానికి తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపుతున్నారంటున్నారు. మిల్లర్లు అధిక తేమ శాతం చూపి, తరుగుతో కొనుగోలు చేసి దోపిడీకి తెరలేపారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News December 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

<>యూనివర్సిటీ <<>>ఆఫ్ లక్నోలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ( డెమోగ్రఫీ/పాపులేషన్ స్టడీస్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/మ్యాథ్స్/సోషియాలజీ/సోషల్ వర్క్/ఆంత్రోపాలజీ/జియోగ్రఫీ)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్:https://mohfw.gov.in