News January 26, 2025
సిరిసిల్ల: విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసిన కలెక్టర్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జాతీయ పతాకావిష్కరణకు హాజరైన విద్యార్థులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు మంచిగా చదువుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 2, 2025
KMR: రేపు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి

కామారెడ్డిలో విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 2, 2025
HYD: TRPలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


