News March 1, 2025
సిరిసిల్ల: విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి: ప్రవీణ్

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం డీఈఓ కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.
News November 20, 2025
గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.
News November 20, 2025
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.


