News September 14, 2024
సిరిసిల్ల: విష జ్వరంతో బాలిక మృతి
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబీకుల ప్రకారం.. మైదం శెట్టి మల్లికార్జున్ పెద్ద కూతురు నక్షత్ర హాసిని(13)కి బుధవారం జ్వరం వచ్చింది. స్థానిక ఓ ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించగా నయం కాలేదు. ఆ తర్వాత సిరిసిల్ల, KNR నుంచి HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది.
Similar News
News October 7, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మానకొండూరు మండలంలో విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ గుండెపోటుతో హుజురాబాద్ ఆర్టీసీ డిపో డ్రైవర్ మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు.
@ కరీంనగర్ జిల్లా గ్రంధాలయ చైర్మన్‌గా మల్లేష్.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా సత్యనారాయణ గౌడ్.
@ మెట్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో బతుకమ్మ సంబరాలు.
News October 6, 2024
నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.
News October 6, 2024
కరీంనగర్: 21 ఆసుపత్రులకు గుర్తింపు
కరీంనగర్ జిల్లాలో 21 ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లాలో అందుతున్న ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. ఇందులో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కాయకల్పకు ఎంపిక కావడం జరిగింది. మోతాజాఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంకు బెస్ట్ అవార్డు, బుట్టిరాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం కమండేషన్ విభాగంలో కాయకల్ప గుర్తింపు దక్కించుకొని అవార్డుకు ఎంపికైంది.