News March 30, 2025
సిరిసిల్ల: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తంగళ్లపల్లి(M) బస్వాపూర్‌కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.
Similar News
News February 25, 2026
GWL: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేసి పురోగతి సాధించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేశారు. భూభారతి దరఖాస్తులు, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల జారీ తదితర అంశాల పురోగతిపై సమీక్షించారు. ఓటరు జాబితా సవరణలో తప్పిదాలు లేకుండా మ్యాపింగ్ చేయాలని సూచించారు.
News February 25, 2026
రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న KTR

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News February 25, 2026
YELLOW ALERT: రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.


