News April 2, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి ఏ.రామదాసు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News April 21, 2025
NRPT: హోమ్ గార్డులకు ఘనంగా వీడ్కోలు

జిల్లాలో పని చేసిన 61 మంది హోమ్ గార్డులు మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో హోమ్ గార్డులతో సమావేశం నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హోమ్ గార్డులు చేసిన సేవలను కొనియాడారు. అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని ఇన్ఛార్జ్ ఆర్ ఎస్ఐ మద్దయ్య అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
News April 21, 2025
కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.
News April 21, 2025
నేడు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో పరిష్కార వేదిక

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలచే తమ సమస్యలపై వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి కృషి చేస్తామన్నారు.