News March 10, 2025

సిరిసిల్ల: సమర్థవంతంగా నిర్వహణ జరగాలి: మంత్రి

image

నీరు వృథా కాకుండా సమర్థవంతంగా సాగునీటి నిర్వహణ జరగాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులపై సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

Similar News

News February 7, 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుత్తూరు కృష్ణానగర్‌లో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు కుమార్తెలు తేజ, లాస్యతో కలిసి తల్లి పద్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమార్తెల మృతిపై భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News February 7, 2026

తూర్పు, ఉత్తరం దిక్కులకే ప్రాధాన్యమెందుకు?

image

వాస్తు శాస్త్రంలో తూర్పు, ఉత్తర దిక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బలమైన కారణాలున్నాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఎక్కువ మందికి వారి పేరు బలం, జన్మరాశి రీత్యా ఈ దిక్కులు బాగా కలిసివస్తాయి. ఇవి శుభ ఫలితాలను, లబ్ధిని చేకూరుస్తాయి. అనుభవజ్ఞులూ అదే చెబుతుంటారు. అందుకే ఇల్లు కొన్నా, కట్టినా, అద్దెకు తీసుకున్నా చాలామంది మొదట ఈ దిక్కులకే ప్రాముఖ్యతనిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 7, 2026

పాక్ గెలవలేదు.. మేమే ఓడిపోయాం: నెదర్లాండ్స్ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు

image

T20 WCలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం’ అని అన్నారు. 148 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్‌ను కట్టడి చేసినా చివరి ఓవర్లలో ఎగ్జిక్యూషన్ లోపించిందని వాపోయారు. ముఖ్యంగా ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ మిస్ చేయడం, డెత్ ఓవర్లలో భారీగా రన్స్ ఇవ్వడం తమ గెలుపును దూరం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.