News February 8, 2025

సిరిసిల్ల: సమస్యలుంటే సంప్రదించాలి

image

రానున్న ఎండాకాలం, వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల సిస్ పరిపాలన సంచాలకులు విజయేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆ యొక్క మండల ఏఈలకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.

Similar News

News November 17, 2025

కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.

News November 17, 2025

యాదాద్రి: నేటి నుంచి పత్తి మిల్లులు బంద్

image

నేటి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల అసోసియేషన్ నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు పత్తి మిల్లుల అసోసియేషన్ తెలిపింది. కావున రైతులెవరూ మార్కెట్ యార్డ్‌కు పత్తిని తీసుకురావద్దని మిల్లుల యాజమాన్యం కోరింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులు ఏం చేయాలో తెలీక అయోమయంలో పడిపోయారు. అధికారులు త్వరగా చర్చలు జరిపి మిల్లులు తెరుచుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

News November 17, 2025

HYD: మహిళలు.. దీనిని అశ్రద్ధ చేయకండి

image

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో కణతి చేతికి తగలడం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రవాలు కారటం, చొట్టబడి లోపలికి పోవడం, ఆకృతిలో మార్పు, గజ్జల్లో వాపు లాంటివి కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళ మామోగ్రామ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం మంచిదని MNJ ప్రొ.రఘునాథ్‌రావు తెలిపారు.